కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి తనయులు వివేక్, వినోద్ టీఆర్ఎస్ ను
వీడనున్నారా? మళ్లీ సొంత గూటి బాట పట్టనున్నారా? దీనిపై ఊహాగానాలు
జోరందుకుంటున్నాయి. ఈ ఊహాగానాలు నిజమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. ఆదివారం
వీరిద్దరూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ను ఆయన ఇంటికెళ్లి
కలవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా
మామూలు కారులో దిగ్విజయ్ ఇంటికెళ్లడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై వివేక్, వినోద్ లు డిగ్గీ రాజాతో
చర్చించినట్టు సమాచారం. గంటకు పైగా సమావేశమయ్యారు. వీరిద్దరూ త్వరలో
కాంగ్రెస్ పార్టీలో చేరుతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వివేక్,
వినోద్ టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం గత
కొద్దిరోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్
వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా ఖండించకపోవటం విశేషం. వీరు గతేడాది జూన్ లో టిఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.
సొంతగూటి బాటలో కాకా తనయులు?
Reviewed by రాజాబాబు కంచర్ల
on
10:08 AM
Rating:
కామెంట్‌లు లేవు: