జగన్ పార్టీ వైపు చూస్తోన్న కిల్లి కృపారాణి ?

శ్రీకాకుళం కాంగ్రెసు పార్లమెంటు సభ్యురాలు, కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆమె గత కొద్ది కాలంగా ఎవరికీ కనిపించడం లేదని, పార్టీ మారే ఉద్దేశంతోనే ఆమె ఎవరికీ అందుబాటులోకి రావడం లేదని అంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెసు పరిస్థితి దిగజారడంతో ఆమె పార్టీ మారాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. కిల్లి కృపారాణి భర్త డాక్టర్ రామ్మోహన్ రావు కూడా ఎవరికీ అందుబాటులోకి రావడంలేదని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి కిల్లి కృపారాణి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థులను రంగంలోకి దించలేదని అంటున్నారు. పార్టీ మారే ఉద్దేశంతోనే అలా చేసి ఉంటారనే ప్రచారం సాగుతోంది. పార్టీ మారి టెక్కలి శాసనసభా స్థానం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో కిల్లి కృపారాణి ఉన్నట్లు చెబుతున్నారు. ఆమె బిజెపి వైపు చూస్తున్నట్లుగా కూడా కొంత మంది చెబుతున్నారు.
జగన్ పార్టీ వైపు చూస్తోన్న కిల్లి కృపారాణి ?  జగన్ పార్టీ వైపు చూస్తోన్న కిల్లి కృపారాణి ? Reviewed by రాజాబాబు కంచర్ల on 12:06 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

Facebook