దాసరితో జగన్‌ భేటీ

- మర్యాద పూర్వక  కలయికేనంటున్న నేతలు
- పార్టీలోకి రావాలని ఆహ్వానం?
               మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావుతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణా కర్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని దాసరి నారాయణరావు ఇంటికి జగన్‌ మంగళవారం సాయంత్రం వెళ్లారు. ఈ సంద ర్భంగా దాసరిని పార్టీలోకి రావాలని జగన్‌ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పార్టీలో సముచిత స్థానం కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇది పూర్తిగా వ్యక్తిగత భేటీ మాత్రమేనని, మర్యాద పూర్వక సమావేశం తప్ప ఇందులో రాజకీయ అంశాలు ఏమీ లేవని పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. జగన్‌, దాసరిల భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర మైన చర్చకు తెరలేపింది. తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు కాపులను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో జరిగిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కాపులను ఆకర్షించే నేత కోసం జగన్‌ అన్వేషణలో భాగంగా దాసరిని కలిసినట్లు కనిపిస్తోంది. తెలు గుదేశంకు మద్దతిస్తున్న జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ కు దీటైన జనాకర్షక నేతగా దాసరిని వైఎస్‌ఆర్‌సిపి భావిస్తోంది. కిర్లంపూడిలో కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం తెలుగు దేశంకు వ్యతిరేకంగా సభ పెడుతున్న సందర్భంలో దాసరిని జగన్‌ కలవడం విశేషం. ముద్రగడ సభకు దాసరి కూడా హాజరవుతారని చెప్పుకుంటున్నారు. దాసరికి పార్టీలో ఏ హోదా కల్పిస్తారన్నది స్పష్టంగా చెప్పలేక పోయినా ఆయన కీలక మార్గదర్శకత్వం వహిస్తారని మరో సీనియర్‌ నేత చెబు తున్నారు.
జగన్‌కు మద్దతు ఇచ్చేందుకు బదులుగా దాసరి ఏమి ఆశిస్తారనేది ఆసక్తికరం. వైఎస్‌ఆర్‌ సిపి నుంచి రాజ్య సభకు నామినేట్‌ కావాలని కోరుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. కొంత కాలంగా దాసరి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీలో కలిపివేసిన నాటి నుంచి దాసరికి కాంగ్రెస్‌లో ప్రాధాన్యం తగ్గింది. బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు రావడంతో దాసరి సైలెంట్‌ అయ్యారు. బొగ్గు కుంభకోణం కేసు విషయంలో కాంగ్రెస్‌ న్యాయ సహకారం అందిస్తుండంతో తన రాజకీయ భవిష్యత్తు ఎటూ తేల్చుకోలేక పోయారు. ఆ నేపథ్యంలో ఆరు నెలల క్రితం ఒకసారి జగన్‌తో భేటీ జరిగినా, ఆ భేటీని రహస్యం గా ఉంచారు. ఆ తరువాత నుంచి దాసరితో వైఎస్‌ఆర్‌ కాం గ్రెస్‌ పార్టీ నేతలు సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. బొగ్గు కుంభకోణం కేసు ఓ కొలిక్కి రావడంతో వైసిపిలో చేరేందుకు దాసరి నుంచి సుముఖత వ్యక్తం చేయడం వల్ల స్వయంగా జగన్‌రంగంలోకి దిగి మంతనాలు సాగిస్తున్పట్లు తెలుస్తోంది.
దాసరితో జగన్‌ భేటీ దాసరితో జగన్‌ భేటీ Reviewed by రాజాబాబు కంచర్ల on 6:05 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

Facebook