ఒంటరి ఏనుగు హల్‌చల్‌..

చంద్రగిరి (తిరుపతి జిల్లా) : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భీమవరం గ్రామంలో గుంపు నుంచి విడిపోయిన ఓ ఒంటరి ఏనుగు అటవీ సమీప ప్రాంతాల్లో హల్‌చల్‌ చేస్తోంది. పంట పొలాలు, మామిడి, టెంకాయ చెట్లను విరిచి విధ్వంసం సృష్టిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 16వ తేదీ సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓ ఏనుగుల మంద చంద్రగిరి మండలంలోని అటవీ ప్రాంతంలో కనిపించింది. మంద నుంచి విడిపోయిన ఒంటరి ఏనుగు మంగళవారం ఉదయం తొమ్మిది గంటల వరకు యల్లంపల్లి, కూచివారిపల్లి, భీమవరం గ్రామాల్లో సంచరిస్తూ రైతుల పంటలను తిని తొక్కి నాశనం చేసింది. గ్రామస్తులు ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఏనుగును అడవిలోకి తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు. గత వారం రోజులుగా ఏనుగుల మంద పంట పొలాలను నాశనం చేస్తున్నాయని, కాపు సమయంలో మామిడి చెట్లను విరిచి నష్టం చేకూర్చుతున్నాయని అటవీశాఖ అధికారులు వెంటనే ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు