రాజ్యసభ ఎన్నికల ఫలితాలు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ సీట్లకు వచ్చే నెల ఏప్రిల్‌తో పదవీ కాలం ముగియనుంది. దీంతో ఆ సీట్లకు సోమవారం ఎన్నిక జరిగింది. ఈ 37 స్థానాల్లో 26 మంది అభ్యర్థులకు పోటీనే లేదు. ఇక మిగిలిన 11 స్థానాల్లో బీహార్‌ 5, ఓడిశా 4, హర్యానా 2 స్థానాలకు ఎన్నిక జరిగింది. బీహార్‌కు చెందిన ఐదు స్థానాల్లో ఎన్‌డిఎ గెలుపొంది. బీహార్‌ : గెలుపొందినవారు నితీష్‌కుమార్‌ (జెడియు), నితిన్‌ నబిన్‌ (బిజెపి), రామ్‌నాథ్‌ ఠాకూర్‌ (జెడియు), శివేష్‌ కుమార్‌ (బిజపి), ఉపేంద్ర కుష్వాహా (ఆర్‌ఎల్‌ఎం). ఒడిశా : మన్మోహన్‌ సమల్‌ (బిజెపి), సుజీత్‌ కుమార్‌ (బిజెపి), సంతృప్త్‌ మిశ్రా (బిజెడి).దిలీప్‌ రారు (స్వతంత్ర అభ్యర్థి) హర్యానా : సంజరు భాటియా (బిజెపి), కరంవీర్‌ సింగ్‌ బౌధ్‌ (కాంగ్రెస్‌). తమిళనాడు : మాజీ లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ ఎం తంబిదురై (డిఎంకె), సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి (కాంగ్రెస్‌) గెలుపొందారు. పశ్చిమ బెంగాల్‌ : నలుగురు తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో బాబుల్‌ సుప్రియో, పశ్చిమ బెంగాల్‌ మాజీ డిజిపి రాజీవ్‌ కుమార్‌, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది మేనకా గురుస్వామి, నటి కోయెల్‌ మల్లిక్‌ ఉన్నారు. బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్‌ సిన్హా కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహారాష్ట్ర : మహాయతి కూటమి 6, ఎన్‌సిపి (ఎస్‌పి) శరద్‌పవార్‌ మొత్తం ఏడుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం సీట్ల సంఖ్య 37 మహారాష్ట్ర (7) : ఎన్‌డిఎ :6, ఎన్‌సిపి (ఎస్‌పి) : 1. తమిళనాడు (6) : డిఎంకె (2), కాంగ్రెస్‌ (1), డిఎండికె (1) , పిఎంకె (1), ఎఐఎడిఎంకె (1). బీహార్‌ (5) : ఎన్‌డిఎ (5) ఒడిశా (4) : ఎన్‌డిఎ (3), బిజెడి( 1) అస్సాం (3) : ఎన్‌డి (3). ఛత్తీస్‌గఢ్‌ (2) : బిజెఇ (1), కాంగ్రెస్‌ (1). తెలంగాణ (2) : కాంగ్రెస్‌ (2) హిమాచల్‌ప్రదేశ్‌ (1) : కాంగ్రెస్‌ (1) హర్యానా (2) : బిజెపి (1), కాంగ్రెస్‌ (1)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు