ప్రస్తుత డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ బయోపిక్ రూపుదిద్దుకుంటోంది. స్టాలిన్ పాత్రలో తమిళ నటుడు సముద్రఖని నటించబోతున్నారు. ఇప్పటికే సినీ రాజకీయ నాయకులైన జయలలిత, ఎన్టీఆర్ వంటి మహామహుల బయోపిక్స్ వచ్చాయి. ఇప్పుడు స్టాలిన్ బయోపిక్ సిద్ధమవుతోంది. దర్శకుడు సముద్రఖని ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు సిద్ధం చేశారు. ఆయనే సిఎం స్టాలిన్ పాత్ర పోషించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టనున్నారు. స్క్రిప్టు పనుల్లో మరో నటుడు, దర్శకుడు బోస్ వెంకట్ సహకరిస్తున్నారు. సముద్రఖని కూడా సీఎంకు అత్యంత సన్నిహితులుగా ఉండే నేతలను కలిసి వివరాలు సేకరించే పనుల్లో నిమగమయ్యారు. ప్రీప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చే యేడాది సెట్స్‌పైకి తీసుకెళ్ళాలన్న ఆలోచనలో సముద్రఖని ఉన్నట్లుగా సమాచారం. కాగా, స్టాలిన్ 80లలో రెండు సినిమాల్లో హీరోగా కూడా చేశారు. అవి ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో రాజకీయాలకు పరిమితమయ్యారు.
0 కామెంట్‌లు